వికారాబాద్, మార్చి 6 : జిల్లాలో జరిగే సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఎక్కడ కూడా ఆగకుండా పూర్తిచేసి, వాటికి ఎఫ్టీఓ జనరేట్ చేయాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పంచాయతీరాజ్ ఈఈలు, డీఈలతో టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లాలో జరిగే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడ కూడా ఆగకుండా అనుకున్న అంచనాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి అయిన వాటికి తప్పనిసరిగా ఎఫ్ టీవో జనరేట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా, ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పెండింగ్ ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేసి, పూర్తి అయిన వాటికి తప్పనిసరిగా ఎఫ్‌టీవో జనరేట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సీసీ రోడ్లకు మంజూరైన నిధులతో అంచనాలను రూపొందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.