ఆదిబట్ల, మార్చి 3: కొంగరకలాన్‌లో తైవాన్ దేశానికి చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు సన్నాహాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య మాట్లాడుతూ ఫాక్స్‌కాన్ కంపెనీ రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడంతోపాటు ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.