మంచాల, మార్చి 2 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలు, తండాల రూపురేఖలను మార్చుతున్నది. ప్రతినెలా ప్ర భుత్వం విడుదల చేస్తున్న నిధులతో తండాలు, గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తండాలు అభివృద్ధికి దూరంలో ఉండేవి. కానీ.. సీఎం కేసీఆర్ తండాల అభ్యున్నతే లక్ష్యంగా వాటిని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి.. కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తుండటంతో తండాలు అభివృద్ధిలో ముందున్నాయి. ఏ వీధిలో చూసినా సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటయ్యాయి అందుకు నిదర్శనం మండలంలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన కొర్రవానితండా, సత్యంతండా, ఆంబోతుతండా, పటేల్చెర్వుతండాలు.
ప్రభుత్వం పల్లెప్రగతి క్రింద కేటాయించిన నిధులను ఆయా గ్రామాల సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు సద్వినియోగం చేసుకుంటూ ఊర్లను ప్రగతిబాటలో నడిపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో హరితహారం నర్సరీ, పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు తదితర వాటిని కొ నుగోలు చేశారు. ప్రతిరోజూ పంచాయతీ సిబ్బంది గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ల సహాయంతో డంపిం గ్ యార్డులకు తరలించి.. అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
ఆయా గ్రామాల్లో తెలంగాణకు హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నది. తండాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తండాల్లోని ప్రజలు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నారు. ఎండాకాలంలో నర్సరీ, పల్లెప్రకృతివనాల్లోని మొక్కలు ఎండిపోకుండా తడులవారీగా నీటిని ఉదయం, సా యంత్రం సమయాల్లో అందిస్తున్నా రు. సర్పంచ్, అధికారులు ఇంటిపన్నులను వంద శాతం వసూలు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నా..
తండాలోని సమస్యలను ముందుగానే గుర్తించి గ్రామపంచాయతీ సభ్యుల ఆమోదంతో పరిష్కరిస్తున్నా. గతంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేది. ప్రభుత్వం కేటాయించిన నిధుల తో ముందుగా అన్ని వీధుల్లో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వీధి దీపాలను ఏర్పాటు చేశా. గ్రామాన్ని మండలంలోని మిగిలిన గ్రామాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. గ్రా మాభివృద్ధికి అధికారులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఎంతో సహకరిస్తున్నారు.
-సర్పంచ్ లక్ష్మి, కొర్రవాని తండా
గ్రామాభివృద్ధికి కృషి
సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాకుం డా.. వాటి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ముందుగా ప్రాధాన్యమున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం. గ్రామంలో పంచాయతీ భవనం లేకపోవడంతో రూ.20 లక్షలతో దానిని నిర్మిస్తున్నాం.
-రాజూనాయక్, సర్పంచ్ పీసీతండా