సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇక మళ్లీ చిన్నారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉదయం టిఫిన్ చేయకుండా బడికి వచ్చే పిల్లలకు ధ్యాసంతా ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. మరోవైపు పోషకాహార లోపం, రక్తహీనత సమస్య పిల్లలను వేధిస్తుండడం తెలిసిందే. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అల్పాహారం అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం వారు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అల్పాహారం కింద పులిహోర, పొంగల్, సేమియా, కిచిడీ, ఉప్మాతోపాటు పల్లీచట్నీ, సాంబార్ తదితర వాటిని ప్రతిరోజూ అందిస్తారనడం చాలా సంతోషకరమన్నారు.
ఇంట్లో తినలేని అల్పాహారాన్ని పాఠశాలలో తినడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కోసారి ఇంట్లో టిఫిన్ చేయకుండానే స్కూల్‌కు వస్తాం. మధ్యాహ్నం బడిలో వడ్డించే మధ్యాహ్న భోజనంతో టిఫిన్, భోజనం సరిపెట్టుకొంటాం. ఆకలితో టీచర్ ఏ పాఠం చెబుతున్నారనే ధ్యాస ఉండదు. మధ్యాహ్నం ఎప్పుడవుతుంది, భోజ నం ఎప్పుడు పెడుతారని ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇక అలాంటి బాధ ఉండదు. సీఎం కేసీఆర్ సార్ పేద విద్యార్థులకు అందించిన అల్పాహారం ఎంతో బాగుంది. ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– శివశంకర్, 5వ తరగతి, జీసీపీఎస్, కొడంగల్
నేడు ప్రారంభించిన సీఎం అ ల్పాహారం పథకం పేద విద్యా ర్థులకు గొప్ప వరం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా మంది ఉదయం టిఫిన్ చేయ కుండానే పాఠశాలకు హాజరవు తారు. దీంతో ఒక్కోసారి పాఠ శాలలో కండ్లు తిరిగి పడిపోతున్నారు. విద్యార్థుల ఆ రోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– అబ్దుల్ హఖ్, ఉపాధ్యాయుడు, జీసీపీఎస్ పాఠశాల, కొడంగల్
విద్యార్థులకు సీఎం కేసీఆర్ సార్ అందిస్తున్న అల్పాహారం ఎంతో రుచికరంగా ఉంది. రోజుకో విధంగా పౌష్టికాహారాన్ని అందిస్తారని మా టీచర్లు చెపుతుండడం చాలా ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలకు సమయానికి చేరుకోవాలనే ఆతృతతో ఒక్కోసారి ఉదయం ఏమి తినకుండానే వస్తా. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్న భోజనాన్ని తినే పరిస్థితి ఉంది. ఇక నుంచి ఉపవాసం ఉండాల్సిన అవసరంలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం కూడా పౌష్టికాహారాన్ని తింటా.
– హర్ష, 5వ తరగతి, జీసీపీఎస్, కొడంగల్
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. నా కుమారుడు కార్తీక్, కడ్తాల్‌లోని బాలుర ఉన్నత పాఠ శాలలో పదో తరగతి చదువుతు న్నాడు. ఒక్కోసారి ఉదయం టిఫి న్ చేయకుండానే స్కూల్‌కు వెళ్తుంటాడు. దీంతో పిల్లలు చదువుపై ధ్యాస ఉంచలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో బాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– డేరంగుల పాండు, కడ్తాల్
సీఎం కేసీఆర్ మాకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. దాంతోపాటు ప్రతిరోజూ ఉదయం సమయంలో అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నోసార్లు ఉపవాసంతోనే స్కూల్‌కు వచ్చా. ఇక ఇంట్లో టిఫిన్ చేయకుండానే స్కూల్‌కు మరింత తొందరగా వస్తా. ఆకలితో ఉండకుండా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న టిఫిన్ తిని బాగా చదువు కుంటా. పిల్లలకోసం అల్పాహారాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటికే ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా విద్యను అందిస్తున్నది. విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలలకు రాకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం మాకు ఎంతో వరంలాంటిది
– మనోహర్, ప్రభుత్వ పాఠశాల, గౌతాపూర్, తాండూరు
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడంతోపాటు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాలతో ఎంతోమంది లబ్ధిపొందుతున్నారు. పథకాల్లో భాగంగా గ్రామీణ పేద విద్యార్థుల సంక్షేమానికి పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం .. విద్యార్థులకు టిఫిన్‌ను అందించేందుకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని సీఎం తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయం.
– ఐలయ్య, విద్యాకమిటీ చైర్మన్, ఇబ్రహీంపట్నంరూరల్
గ్రామాల్లో ఉండే పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభు త్వ పాఠశాలల్లో సకల సౌకర్యా లు కల్పించడంతో పాటు కా ర్పొరేట్కు దీటుగా విద్యను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ప్రభుత్వం మరోసారి గొప్ప నిర్ణయం తీసుకుని పాఠశాలల్లో అల్పాహారం అందించడం ఎంతో ఆనందించదగిన విషయం. ఇంతమంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– జశ్వంత్, పదో తరగతి, ఇబ్రహీంపట్నంరూరల్
పేద పిల్లలకోసం ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటికే కడుపునిండా భోజనం చేస్తున్న మాకు ఉదయం పూట అల్పాహారాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి మా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వ సేవలను మరచిపోను. ఇక నుంచి బాగా చదువుకొంటా. సమ యానికి పాఠశాలకు వస్తా. మా ఉపాధ్యాయులు కూడా పాఠాలు చాలా బాగా బోధిస్తున్నారు. చాలా సార్లు పాఠశాలకు టిఫిన్ చేయకుండానే వచ్చేది. అలాంటి సమయంలో ఉపాధ్యాయులు చెప్పేది ఏమి అర్థమయ్యేది కాదు.
– పల్లవి, ప్రభుత్వ పాఠశాల, గౌతాపూర్, తాండూరు
దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు అలసట లేకుండా ఉండేందుకు ఉదయం సమయంలో పౌష్టికాహారమైన ఇడ్లీ, వడ, పూరి, కిచిడీ, పొంగల్ వంటి టిఫిన్లు అందించడం సంతోషకరం. ఇంత గొప్ప నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టడం సహోసోపేత నిర్ణయం.
– రవణమోని మల్లీశ్వరి, సర్పంచ్, దండుమైలారం, ఇబ్రహీంపట్నంరూరల్
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఎంతోమంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ఉదయం సమయంలో ఏమి తినకుం డానే పాఠశాలలకు వస్తుంటారు. దీంతో వారు పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేకపోతుంటారు. ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహా రం, మధ్యాహ్నం భోజనం అందించడం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను శ్రద్ధగా చదువుతారు. అల్పాహారం అందించడం ఒక మంచి ఆలోచన. ఇలాంటి పథ కం దేశంలో ఎక్కడాలేదు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంకోసం రాగిజావ అందిస్తున్న ప్రభుత్వం అల్పాహారాన్ని అందించడం సంతోషం.
– మనోహర్, ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్, షాద్‌నగర్
పాఠశాలకు ఉదయం రాగానే టిఫిన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. గతంలో మధ్యా హ్న భోజనం మాత్రమే పెట్టేవారు. ఉదయం ఒక్కోరోజు తినకుండానే పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం వరకు ఉండాల్సి వచ్చేది. ఇప్పు డు పాఠశాలల్లో అల్పాహారాన్ని అందజేస్తుండ టంతో మధ్యాహ్నం వరకు పస్తులుండే అవసరం లేదు. ఇంటి వద్ద రోజూ టిఫిన్ కోసం వేచి చూడకుండా త్వరగా పాఠశాలకు వస్తా. అల్పామార పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఎండీ అయాన్, విద్యార్థి, పీఎస్ మన్నెగూడ, పూడూరు
ఉదయం పాఠశాలకు వస్తుంటా. నాలాంటి విద్యార్థుల బాధలు తెలుసు కుని సీఎం కేసీఆర్ సార్ ప్రతిరోజూ టిఫిన్ అందిం చాలని నిర్ణయించడం సంతోషకరం. మా పాఠశాలలో ఉదయం ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులందరం రుచికరమైన టిఫిన్‌ను కడుపునిండా తిన్నాం. ఎంతో బాగుంది. సీఎం కేసీఆర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
– వీణ, 8వ తరగతి, ఇబ్రహీంపట్నంరూరల్
మా పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సార్ మాకు అల్పాహా రం వడ్డించారు. ఈ అల్పాహారం ఎంతో రుచికరంగా ఉంది. ఉదయం వేళల్లో మా అమ్మానాన్నలు పనికి వెళ్తారు. సమయానికి వంట కాకపోతే ఒక్కోరోజు మధ్యా హ్నం వరకు ఉపవాసం ఉండాల్సిందే. కానీ పాఠశాలలో నేటి నుంచి ప్రభుత్వం టిఫిన్ వడ్డిస్తుందని తెలిసి సంతోషంగా ఉన్నది. ఉదయమే త్వరగా పాఠశాలకు వచ్చా. టిఫిన్ ఎంతో బాగుంది. థాంక్స్ కేసీఆర్‌సార్. మీరు ప్రవేశపెట్టిన పథకం చాలా బాగున్నది.
– దీపిక, పదో తరగతి, దండుమైలారం, ఇబ్రహీంపట్నంరూరల్