మంచాల, ఏఫ్రిల్ 9 : రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని వివిధ గ్రామాలకు గత 15రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. గురువారం మంచాల మండలం ఆరుట్ల గామ్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో గ్రామాల్లోని ప్రజలు తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మరో పక్క గత 15రోజుల నుంచి మిషన్‌భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని చెప్పారు. వెంటనే గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని లేని యెడల మంచాల మండల పరిషత్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు పాండాల జంగయ్య గౌడ్, మానుపాటి శోభ, నూకం రాజు, చిందం రఘుపతి, పూనం రాము, ఎండీ జానీపాషా, నూతన గంటి శేఖర్, చిందం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.