శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 30, 2020 , 07:07:39

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం.. మంత్రి సబితాఇంద్రారెడ్డి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం.. మంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మాణిక్యమ్మగూడకు చెందిన కె. ప్రమీల, జి.రమేశ్‌, నర్సింహలకు మంజూరైన చెక్కులను మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా నగరంలో మంత్రి నివాసంలో ప్రమీలకు రూ.60 వేలు, రమేశ్‌కు రూ.39,500లు, నర్సింహకు రూ.37,500 విలువగల చెక్కులను అందజేశారు. సహకారబ్యాంక్‌ వైస్‌చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మాసారం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.