తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి
తిరుమల | ఆలయ మాజీ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా కఠిన ఆంక్షల మధ్య కొద్ది మందికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవలే ఆలయ మాజీ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నారాయణ దీక్షితుల ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
విశ్రాంత ప్రధాన అర్చకుడి మృతి పట్ల టీటీడీ చైర్మన్ సంతాపం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. నారాయణ దీక్షితులు మరణ వార్త తనకు ఆవేదన కలిగించిందని చెప్పారు. దశాబ్దాలపాటు ఆయన శ్రీవారి సేవలో తరించారని చైర్మన్ కొనియాడారు. శ్రీ దీక్షితులు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు నిబ్బరం ప్రసాదించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

