సిక్కు యువకుడిపై సుత్తితో దాడి.. ఆమెరికాలో దారుణం..!
Attack on Sikh Man: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా వాసులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఓ హోటల్లో

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా వాసులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఓ హోటల్లో సుమిత్ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడి చేశాడు. దాడి సమయంలో ఆ వ్యక్తి ‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. నీ శరీరం రంగు నాలాగా లేదు’ అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. దాంతో జాతి వివక్ష కోణంలో ఈ దాడి జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ‘ఏప్రిల్ 26న బ్రౌన్స్‌విల్లేలో నేను పనిచేస్తున్న ది క్వాలిటీ ఇన్ హోటల్‌కు ఒక నల్ల జాతీయుడు వచ్చాడు. అతడు లాబీలోకి చేరి పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడే ఉన్న రిసెప్షనిస్టు ఏం కావాలని ప్రశ్నించింది. అదే సమయంలో నేను వెళ్లి అతనితో మాట్లాడాను. కానీ, ప్రయోజనం లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని పిలిచాను. దాంతో అతడు కోపంతో జేబులో చేతులుపెట్టుకొని నావైపు వేగంగా వచ్చాడు. అతడి దగ్గర తుపాకీ ఉందని భయపడి నువ్వు నా సోదరుడివి అంటూ అనునయించే ప్రయత్నం చేశాను. అయినా, నీ చర్మం రంగు వేరు, నా చర్మం రంగు వేరు అంటూ అతడు జేబులో నుంచి సుత్తి బయటకు తీసి నా తలపై దాడి చేశాడు’ అని సుమిత్ వివరించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆటోవాలాలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం
ముగిసిన ఎన్నికలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది దుర్మరణం
జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటించిన స్టాలిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

