మైలార్దేవ్పల్లి, ఫిబ్రవరి 19: చత్రపతి శివాజీ తన ధీరత్వంతో, నియంతృత్వాన్ని ఎదిరించి, సామాజిక రాజ్య స్థాపనతో సబ్బండ వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించిన మహారాజ్ అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు. శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం మైలార్దేవరపల్లి చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి , బృందావన్ కాలనీలోనీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆయన సేవలను కొనియాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ధైర్య సాహసాలు యువతకు ఆదర్శం అని వారు చూపిన మార్గంలో నడవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మైలార్దేవ్పల్లి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎన్. ధనుంజయ, టి. ప్రేమ్ గౌడ్, సరికొండ వెంకటేష్, లక్ష్మారెడ్డి, ఖలీల్, రామకృష్ణారెడ్డి, శేఖర్, జగదీష్, అనిల్, సిద్ధం జగదీష్, శ్రీనివాస్, రాజు, నాగరాజ్, కే. ఎస్. రెడ్డి, మదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.