షాబాద్, మే 15: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ పీఆర్ఆర్ స్టేడియంలో, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కప్-2023 క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆటల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీలు జడల లక్ష్మీరాజేందర్గౌడ్, మమత, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎంపీడీవోలు అనురాధ, రాజ్‌కుమార్, సంధ్య, వెంకయ్య, ఎంపీవోలు హన్మంత్‌రెడ్డి, విఠలేశ్వర్, వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు మల్లారెడ్డి, సత్యమ్మ, కుమార్, సుమిత్ర, శ్రీనివాస్, లలిత, ఎంపీటీసీలు కరుణాకర్, శ్రీనివాస్, సరిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు శేఖర్, నాయకులు జయవంత్, ప్రవీణ్‌కుమార్, నర్సింహారెడ్డి, విఠల్, రవి, రాజు, ఈశ్వర్, గోపాల్‌రెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్, ఆశీర్వాదం, పంచాయతీ కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ : క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. నియోజకవర్గంలోని షాద్‌నగర్, నందిగామ, కొత్తూరులతో సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న క్రీడల పోటీల్లో అన్ని వర్గాల క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్ సీఎం కప్ క్రీడల పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు ఆట వస్తువులను అందజేశారు. చౌదరిగూడ, కొందుర్గు మండల కేంద్రాల్లో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కౌన్సిలర్లు చెట్ల పావని, ప్రతాప్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, కొత్తూరు మున్సిపల్ చైర్మన్ బాతుక లావణ్య, వైస్ ఎంపీపీ శోభ, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, కాట్న రాజు, అజయ్‌నాయక్, రమేశ్‌గౌడ్, రవీందర్, రాఘవేందర్, యాదగిరి, బాల్‌రాజ్, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆమనగల్లు బాలుర జడ్పీహెచ్ఎస్ ఆవరణలో సీఎం కప్ పోటీలను ఎంపీపీ అనిత అధ్యక్షతన ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి మండల కేంద్రంలో 7 ఎకరాల్లో రూ.5 కోట్లతో స్టేడియం నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఈ పోటీల నిర్వహణకు ఎంపీపీ అనిత రూ.10 వేలు, జడ్పీటీసీ అనురాధ రూ.10 వేలు, రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు రూ. 10 వేలు, ఇతరులు రూ. 5 వేల చొప్పున సాయం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రాధమ్మ, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఎంపీటీసీ సరిత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : క్రీడలకు ప్రభుత్వం పెద్దపీటను వేస్తున్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. సీఎంకప్ 2023 క్రీడా పోటీలను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్‌గూడ రాజమహేంద్ర కళాశాలలో ఎంపీపీ కృపేశ్ క్రీడలను ప్రారంభించారు. యాచారం మండల కేంద్రంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, మంచాల మండల కేంద్రంలో ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో ఎంపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, వైస్‌ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు.
కడ్తాల్ : క్రీడారంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మండల స్థాయి చీఫ్ మినిస్టర్ కప్-2023 ఆటల పోటీలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జడ్పీటీసీ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, సులోచన, భారతమ్మ, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, అనిల్, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సింహ, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనాచారి పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల పరిధిలోని 32 గ్రామాల్లోని క్రీడాకారులను వెలికితీసి వారి ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంపీపీ నిర్మల అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన క్రీడా పోటీలను ఎంపీపీ నిర్మల ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఎంఈవో సర్దార్‌నాయక్, సర్పంచ్ కుమార్, నాయకులు జ్యోతయ్య, రఘుమారెడ్డి, భగవాన్‌రెడ్డి, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.