మొయినాబాద్, జూన్ 8 : కష్టకాలంలో పార్టీతో ఉన్న నాయకులకు అధిష్ఠానం సముచిత ప్రాధాన్యమిస్తుందని.. ఈ విషయంలో అధైర్యపడొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటా లు చేస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్పై ఉందన్నారు. సోమవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో గల వీపీ కన్వెన్షన్‌లో చేవెళ్ల నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం పార్టీ మొయినాబాద్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి సముచిత ప్రాధాన్యమిస్తుందన్నారు.
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టుతూ ప్రజలకు భరోసా ఇద్దామని.. సమస్య వస్తే బీఆర్ఎస్ పరిష్కరిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిద్దామ న్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో జరుగుతుందని.. ప్రతి బూత్‌కు నలుగురు చొప్పున బీఎల్ఏలను పార్టీ తరఫున నియమించడం జరుగుతుందని, వారితో సమన్వయం చేసుకుని బోగస్ ఓట్ల తొలగింపుపై అప్రమత్తం గా ఉండాలన్నారు. సభ్యత్వ నమోదుతోపాటు సమాంతరంగా కమిటీలనూ ఏర్పా టు చేస్తామన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీలు బోగస్ ఓట్లను నమో దు చేయించి ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో గెలుపొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికే ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. అదేవిధంగా సీఎంకోసం ఏర్పాటు చేస్తున్న సభలకు సంక్షేమ పథకాలు పొందిన వారు రాకపోతే పథకాలను రద్దు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను పార్టీ మారాలని స్థానిక ఎమ్మె ల్యే ఒత్తిడి తెస్తున్నారని, ఎమ్మెల్యే మాట వినకపోతే దాడులు చేయించి అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
జిల్లాలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధ్దన్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు దేశమొళ్ల ఆంజనేయులు, ఎంఏ రావూఫ్, శ్రీహరియాదవ్, నర్సింగ్‌రావు, గోవర్ధ్దన్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, శ్రీనివాస్, రవీయాదవ్, కృష్ణారెడ్డి, అంజయ్యగౌడ్, సురేందర్‌గౌడ్, షేక్ మహబూబ్, మాల స్వామి, ప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పాలమూరు-రంగారెడ్డిని గాలికి వదిలేశారు..
దక్షిణ తెలంగాణకు గుండెకాయ లాంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని సబితారెడ్డి ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు పనులు 90శాతం వరకు పూర్తయ్యాయని..మిగిలి న 10 శాతం పనులను పూర్తి చేసేందుకు రేవంత్‌రెడ్డి పూనుకోవడంలేదని మండిపడ్డారు. జీవో 111ను ఎత్తివేస్తూ గత ప్రభుత్వం కొత్త జీవోను తీసుకొచ్చినా .. దానిని కూడా అమలు చేయలేకపోతున్నారన్నారు. కేసీఆర్ మొదలెట్టిన పనులను పూర్తి చేసేందుకు రేవంత్‌రెడ్డి ఇష్టపడటం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరు ఒకటేనని, కేంద్రాన్ని వడ్లు కొనుమని చెప్పే ధైర్యం ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు గళం విప్పి… దళం పెంచి.. బలం అవుదామని…నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు భరోసా కల్పిద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
నవాబుపేట : మండలంలోని మూలమాడ గ్రామంలో ఇటీవలి చోటుచేసుకున్న ఇరువర్గాల గొడవల్లో గాయపడిన కుటుంబాలను మాజీ మంత్రి, సబితారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం పరామర్శించారు. గొడవకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది అయిన వాటర్‌మన్ కిష్టయ్య, మాజీ సర్పంచ్ సుబాన్‌రెడ్డి కుటుంబాలను పరామర్శించారు. ఆమె వెంట పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుక్ ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, రాష్ర్ట నాయకుడు నాగేందర్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు భరత్‌రెడ్డి, విజయ్‌కుమార్, శాంతికుమార్ తదితరులు ఉన్నారు.
నేడు డంపింగ్‌యార్డు పరిశీలన
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామ రెవెన్యూలో గత ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాన్ని డంపింగ్‌యార్డుగా మార్చేసిం దని దానిని మంగళవారం సబితారెడ్డి సందర్శించనున్నారని పార్టీ మండలా ధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం..
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్ధులు కావాలి. పార్టీ సభ్యత్వ నమో దు కార్యక్రమం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతుంది. పార్టీ కోసం పని చేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
-రాంబాబు, సభ్యత్వ నమోద కార్యక్రమ ఇన్చార్జి, చేవెళ్ల