రంగారెడ్డి, మే 10 (నమస్తే తెలంగాణ) : భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా జిల్లాలోని పోలీసులు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉన్నా రు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోనే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉండడం తో దాని పరిధిలో ఆంక్షలు విధించడంతోపా టు సీఐఎస్ఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి గస్తీ కాస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చి న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోనూ పాకిస్థాన్ మూలాలు ఉన్నాయన్న ముందు జాగ్రత్తతో పోలీసులు ఎయిర్‌పోర్టును తమ గుప్పిట్లోకి తీసుకుని.. దాని పరిసరాల్లో తనిఖీలను ముమ్మరం చేశా రు. పహాడీషరీఫ్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్డు.. శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్లే రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న డీఆర్డీఎల్, బీడీఎల్, ఆక్టోపస్, ఎన్ఎస్జీ వంటి
రక్షణ రంగ సంస్థలు ఉండడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
జిల్లాలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇటీవల మాక్‌డ్రిల్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆపద సమయంలో పోలీసులు సైరన్ మోగిస్తే, రోడ్ల పై ఉన్న వారంతా ఇండ్లలోకి వెళ్లాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే, జిల్లాపరిధిలో అనుమానితులను గుర్తించి.. పాకిస్థాన్‌కు పంపిస్తున్నారు. అనుమానితుల ను గుర్తించేందుకు పోలీసులు, ఇంzటెలిజెన్స్ , కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృం దాలు రంగంలోకి దిగి.. జల్లెడ పడుతు న్నాయి.