రామాయంపేట, ఫిబ్రవరి 24: మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ సంధ్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 28 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. ఆయనవెంట రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి ఉన్నారు.