రంగారెడ్డి: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్లి బోల్తాకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులు మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.