షాబాద్, జనవరి 13 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాబాద్‌లో నిర్వహించే రైతుధర్నా కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని సభా స్థలాన్ని యువనేతలు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పట్నం అవినాశ్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను పతంగులపై ముద్రించి నిరసనగా ఆవిష్కరించనున్నామని తెలిపారు.
మహిళలకు రూ.2500 పంపిణీ ఏమైందని, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రైతుభరోసా లేదు.. వడ్లకు బోనస్ లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ లూటీ చేసిందన్నారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. షాబాద్‌లో నిర్వహించే రైతుధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరిఫ్, కుమ్మరి దర్శన్, మంగలి సత్యం, కమ్మరి శ్రీను, మధుకర్‌రెడ్డి, ముఖ్రంఖాన్, హరికుమార్, రాంచందర్, శశాంక్‌రెడ్డి, సత్తయ్య, అంబారెడ్డి, పరుశావేది, కావలి కృష్ణయ్య, రాజేందర్‌రెడ్డి, మాజీద్, హరీశ్, హసీం తదితరులు పాల్గొన్నారు.