మంచాల, జూలై 10 : బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గడగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆరుట్ల గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పున్నం రాము అధ్యక్షతన పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు బుద్ధిచెప్పే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, గ్రామ ప్రధాన కార్యదర్శి మహేందర్, బీఆర్ఎస్ నాయకులు రఘుపతి, నూతనగంటి శేఖర్, ఎండీ జానీషాషా, చిందం జంగయ్య, మొర్రి ఐలయ్య, లాలాగారి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పాలన
తుర్కయాంజాల్, : అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ 22వ వార్డు బీఆర్ఎస్ ఇన్చార్జి జగదీశ్వర్, వార్డు అధ్యక్షుడు గుండ్ల రాజిరెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వార్డు పరిశీలకులు శంకరయ్యగౌడ్, దాస్, నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్, గౌని రాజు, నర్సిరెడ్డి, ఉదయ్, యాదగిరి, రాములు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను మరింత పటిష్టం చేయాలి
యాచారం : బీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో రాంబాబు, నర్సింహారెడ్డి, చంద్రయ్య, మల్లయ్య, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.