దోమ, జనవరి12: మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మే ళనానికి పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, జడ్పీటీసి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమ పథ కాలను తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశ మంతా విస్తరింపజేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసు కున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే 18 గ్రామాలకు చెందిన పార్టీ కార్య కర్తలతో గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా బుద్లా పూర్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపి మల్లేశం, సర్పంచ్ శాంతాకొండారెడ్డి, ఎంపీటీసీ నవాజ్‌రెడ్డి, సర్పం చ్ల సంఘం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్ష్మయ్యముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, పార్టీ ప్రధాన,ప్రచార కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాఘవేంద ర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాజగోపాలచారి, పరిగి,కుల్కచర్ల మార్కెట్ కమిటి చైర్మన్లు సురేందర్, హరికృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.