వికారాబాద్, మే 5 : బూత్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివ్‌గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సమగ్ర సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, కమిటీల నిర్మాణం వంటి విషయాలు సుదీర్ఘంగా చర్చించి, చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, కౌన్సిలర్లు పాండు, వేణుగోపాల్, నాయకులు దేవదాసు, సుభాన్‌రెడ్డి, సురేశ్, మల్లేశం, కిశోర్, ప్రశాంత్, అంజి పాల్గొన్నారు.