MLC Kavitha | హయత్‌నగర్, ఫిబ్రవరి 18 : హయత్‌నగర్ మండల కార్యాలయంలో నూతనంగా పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట హయత్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భాస్కర్ సాగర్, జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి ఉన్నారు.
అంతకుముందు హయత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహానికి కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హయత్‌నగర్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, గంగని నగేశ్, పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.