MLA Sabitha | పహాడి షరీఫ్,ఫిబ్రవరి 23: సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి యువత ముందుండాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ వాదే ఉమర్ కాలనీలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్‌ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబిత మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా శారీరక వ్యాయామం, క్రీడారంగాలపై దృష్టి మరల్చి సమాజంలో మంచి గుర్తింపు సాధించాలన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అబ్దుల్లా సాధి, మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ యూసుఫ్ పటేల్, శంషుద్దీన్, దస్తగిరి, హమీద్ అలీ, మన్సూరి, మిరాజ్ భాయ్, మతిన్ పటేల్, సయ్యద్ జిషన్, మగ్దూం బాయ్, మాహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, జల్ పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.