MLA Marri Rajashekar Reddy | మల్కాజ్గిరి, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మల్కాజ్గిరి చౌరస్తాలో జేఏసీ వెంకన్న, రామచర్ల నర్సింగ్ ఆధ్వర్యంలో తొలి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తొలి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కేసీఆర్ చావును కోరుకుంటున్నట్టు సీఎం వ్యాఖ్యనించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్‌ను వ్యక్తిగత దూషణలతో రాజకీయం చేయడం తగదన్నారు. నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు రావడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైయిందని, రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న, కార్పొరేటర్ సునీతరాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, అంజయ్య, పరశురాంరెడ్డి, మురుగేష్, రాముయాదవ్, ఉస్మాన్, భాగ్యనందరావు, చిన్నయాదవ్, నర్సింగ్‌రావు, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, సిద్దిరాములు, శోభ, రాధిక, ఉపేందర్, బాబురావు, శివగౌడ్, సాయిగౌడ్, మల్లేష్‌యాదవ్, శంకర్, సుమన్, నవాబ్, మారుతీ, సంతోష్‌గుప్త, మురళీనాయుడు, సంతోష్నాయుడు, రాజు, రమ, శ్రీలత, హంస, వేణి తదితరులు పాల్గొన్నారు.