ఇబ్రహీంపట్నం, నవంబర్ 23 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, శేరిగూడ, సీతారాంపేట్ గ్రామాల్లో ఆయన నిర్వహించిన రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఉమ్మడి పాలనలో ఇబ్రహీంపట్నం ప్రజలు తీవ్రమైన మంచినీటి ఎద్దడిని ఎదుర్కొన్నారని, నాలుగైదు రోజులకు ఒక్కసారి కూడా నీరురాక మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలకు దిగేవారని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో మిషన్‌భగీరథ ద్వారా రూ.40కోట్లతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఇబ్రహీంపట్నం ప్రజలంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్మరించుకుని మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు యాచారం సుజాత, మంద సుధాకర్, సుల్తాన్, పద్మ, మమత, శ్వేత, శ్రీలత, ప్రసన్నలక్ష్మి, జగన్, శంకరయ్య, విశాల, జ్యోతి, నాయకులు అల్వాల వెంకట్‌రెడ్డి, మడుపు వేణుగోపాల్, మొద్దు అంజిరెడ్డి, తాళ్ల మహేశ్‌గౌడ్‌తో పాటు అనేకమంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకుడు మడుపు వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో ఆటోయూనియన్ భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 300ఆటోలు ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించి తమ మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఉంటుందని ప్రకటించారు. ఆటోలకు ట్యాక్స్ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఆటో యూనియన్లు బీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొన్నారు.
మంచాల : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. అభివృద్ధి చేస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జంగయ్య యాదవ్, భిక్షపతి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఎంపీపీ కృపేశ్ ఆధ్వర్యంలో జోరుగా ప్రచారం సాగుతున్నది.
యాచారం : ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది. మండలంలోని అన్ని గ్రామాలలో జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. మండలంలోని మేడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. గ్రామంలోని గడపగడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అవగాహన కల్పించారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నాయకులు అన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, మాజీ సర్పంచ్ బోడ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు దోస మహేశ్, మధుకర్, కరుణాకర్, మక్కపల్లి శివ, దేవయ్య, దామోదర్, దోస శివ, పకీరా, దోస కృష్ణ, సాయిబాబ, శేఖర్, ప్రకాశ్, ప్రవీణ్, రామకృష్ణ, వెంకటాచారి తదితరులున్నారు.
తుర్కయంజాల్ : మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుల ప్రచార జోరు కొనసాగుతుంది.ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపును అడ్డుకోవడం ఎవరితరం కాదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పెద్దఅంబర్‌పేటలో బీఆర్ఎస్ నాయకులు దండెం రాంరెడ్డి, కంచర్ల సత్యనారాయణరెడ్డి, చెరుకూరి జగన్, కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వివిధ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తట్టిఅన్నారంలో బీఆర్ఎస్ నేత దేవిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో, 14వ వార్డు పరిధి ఇందు పల్లవి, వేంకటేశ్వరకాలనీల్లో కౌన్సిలర్ రోహిణిరెడ్డి, బీఆర్ఎస్ నేత బ్రహ్మానందారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. 18వ వార్డు పరిధిలో కౌన్సిలర్ పరశురాం నాయక్, మాజీ సర్పంచ్ గోపాల్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : ఎన్నికల ప్రచారం భాగంగా మండలంలోని బాటసింగారం గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోడలు మంచిరెడ్డి మౌనికరెడ్డి గురువారం ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టుపెట్టి కారుగుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రవెల్లి లతశ్రీ, వార్డుసభ్యుడు ఎర్రవెల్లి ఉమాకాంత్చారి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ధన్సాగర్రెడ్డి, నాయకులు వెంకటేశ్‌గౌడ్, జంగయ్య పాల్గొన్నారు.