షాద్‌నగర్, నవంబర్ 9 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండలం అయోధ్యపూర్, పుల్లప్పగూడ, చిన్న ఎల్కిచర్ల, శ్రీరంగపూర్, సోమారంపహాడ్, పర్వతాపూర్, పులుసుమామిడి, లాలాపేట, ఉమ్మెంత్యాల, లూర్దునగర్, కొందుర్గు, చెక్కలోనిగూడ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. దశాబ్దాల కాలం పాటు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయా ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ప్రజల మేలు కోరుకునే పార్టీ బీఆర్ఎస్ అని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డులోని సోలిపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసే వారిని ఓటు వేసి ఆశీర్వదించాలని, షాద్‌నగర్ పట్టణాన్ని, మండలాలను అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలంగౌడ్, చెన్నయ్య, రఘుమారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, రమేశ్‌యాదవ్, మహేశ్, అశోక్, నవీన్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
కొత్తూరు, నవంబర్ 9: ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రఖ్యాత జేపీ దర్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట చాదర్ తీసుకెళ్లి దర్గాకు సమర్పించి అనంతరం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ విజయం పై ఆధారపడి ఉందన్నారు. వేరే పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి పదేండ్ల వెనుకకు పోతుందన్నారు. కార్యక్రమంలో పెంటనోళ్ల యాదగిరి, సర్పంచ్ అజయ్‌నాయక్, వైస్ ఎంపీపీ శోభాలింగంనాయక్, పెంటనోళ్ల యాదగిరి, గోపాల్‌నాయక్, గ్రామాధ్యక్షుడు రషీద్, తస్లీమ్ పాల్గొన్నారు.
కొత్తూరు : కారుకు ఓటు వేస్తేనే కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి బాట పడుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి వేగం పెరిగిందన్నారు. ఎవరు ఏమి చెప్పినా అందరి మాటలు విని అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, జె. శ్రీనివాస్‌గౌడ్, శివ, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాసచారి, బాల్‌రాజు, లక్ష్మయ్య, వి.శ్రీనివాస్, శ్రావణ్, రవినాయక్, వెంకటేశ్, బాబూలాల్ పాల్గొన్నారు.