విజన్ తో సమగ్రాభివృద్ధి
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్‌తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం.
- మహేశ్వరం నియోజకవర్గంలో రూ.40కోట్లతో చెరువుల సుందరీకరణ
- మున్సిపల్, కార్పొరేషన్లలో రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి
- 6వేల మందికి ఇండ్ల స్థలాల పంపిణీ
- ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాం
- మెట్రోరైలు విస్తరణను చిత్తశుద్ధితో పూర్తి చేస్తాం
- బీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి
- మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు డిసైడ్ అయ్యారు
- విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్‌తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. గురుకులాలు, కాలేజీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చాం. పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి కల్పిం చాం. రూ.40కోట్లతో చెరువులను సుందరీకరించడంతోపాటు.
అనేక కాలనీలను ముంపు ము ప్పు నుంచి బయటపడేశామని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె తుక్కుగూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ కాలేజీని పట్టుబట్టి సాధించామని, మెట్రో రైలు విస్తరణను కూడా చిత్తశుద్ధితో పూర్తి చేస్తామన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు డిసైడ్ అయ్యారని, మహేశ్వరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు తనను ఆశీర్వదించాలని కోరారు.
ఇవ్వని హామీలను ఎన్నో నెరవేర్చాం
ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఎవరూ అడుగకున్నా అనేక అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో చేపట్టామని మంత్రి చెప్పారు. ము న్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రోడ్ల విస్తరణను చేపట్టి రాకపోకలను సులభతరం చేయడంతోపాటు వివిధ ప్రాం తాలకు కనెక్టివిటీని పెంచామన్నారు.
అందుబాటులోకి ఉన్నత విద్య..
పేద విద్యార్థుల కోసం ఎనిమిది గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు మరో ఎనిమిది గురుకులాల్లో ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బీసీలకు డిగ్రీ కాలేజీ, లా కాలేజీ, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ కాలేజీ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందన్నారు. ఎవరూ అడగకున్నా.. ఇవన్నీ చేశామన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలోఅనేక ప్ర భుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామన్నారు. భవిష్యత్తులో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. తుక్కుగూడ ప్రాంతానికి పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి
శంషాబాద్ నుంచి తుక్కుగూడ, కందుకూరు వర కు మెట్రోను విస్తరించేందుకు రూ.6వేల కోట్లను బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, పులిమామిడి, నాగిరెడ్డి పల్లిలలో కంపెనీలను ఏర్పాటు చేయడంతోపాటు మామిడిపల్లిలో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
తిమ్మాపూర్ రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడంత్లో రెండు నేషనల్ హైవేలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని, నియోజకవర్గంలో ఇంకా అనేక రోడ్లను విస్తరించాల్సి ఉందన్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే రూట్లో వయా మల్లాపూర్ మీదు గా నాదర్‌గూల్, గుర్రంగూడ వరకు రోడ్డును విస్తరించే ప్రతిపాదన ఉందన్నారు. తనతోపాటు సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

