కేశంపేట, మార్చి 27: కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ల యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ(60) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ షాద్ నగర్ నియోజకవర్గ యువనాయకులు, కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ తొమ్మిదిరేకులకు చేరుకొని లక్ష్మమ్మ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ ఎంపీటీసీ యాదయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాల్ రాజ్ గౌడ్, నాయకులు సాజిద్, జమాల్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.