పరిగి : నవాబుపేట మండలంలోని మూలమాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎదుటిపక్షం దాడి చేయగా పోలీసులు బీఆర్ఎస్ వారిపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడంపై ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో పరిగి సబ్‌జైలులో ఉన్న బీఆర్ఎస్ నాయకులను మంగళవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. మాజీ సర్పంచ్ సుభాన్‌రెడ్డి గ్రామంలోకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి మరీ ఆయనపై దాడి చేశారని..సుభాన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.
రాజకీయ కక్షతోనే సుభాన్రెడ్డిపై దాడి చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రతిరోజూ సక్రమంగా వచ్చిన మిషన్ భగీరథ నీరు ఇప్పుడు రావడం లేదంటే అందుకు కారణం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. పోలీసులు కేసును నీరుగార్చి దెబ్బలు తిన్న వారినే జైలుకు పంపించారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు పెట్టేందుకు రేవంత్ సర్కార్ పోలీసులను ఉసి కొల్పుతున్నాదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీశ్‌రావుల ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలకు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి, తాను గ్రామానికెళ్లి చూడగా బీఆర్ఎస్ కా ర్యకర్తలపై దాడికి ఎదుటిపక్షం వారు వాడిన రాడ్లను సైతం పోలీసులు ఇప్పటివరకు సీజ్ చేయలేదన్నారు.
బీఆర్ఎస్ నాయకుల వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారన్నారు. అనంతరం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడు తూ.. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నాయకుడు సుభాన్రెడ్డిపై దాడి చేశారని ఆరోపించారు. గ్రామం లో జరిగిన చిన్న ఘటనను ఆసరాగా చేసుకొని కేసు నమోదు చేయించారన్నారు. సుభాన్రెడ్డితోపాటు తొమ్మి ది మందిపై మొదట కేసు నమోదు చేసి, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. సుభాన్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిలో కొందరిపై నామమాత్రపు కేసు పెట్టారన్నారు. రాష్ట్రం లో 30 నెలలుగా దౌర్జన్య పాలన సాగుతున్నదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, భరత్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, పరిగి నాయకులు పీరంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.