మణికొండ, మార్చి 3: భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మణికొండ మునిసిపాలిటీ పరిధిలో సోమవారం ‘గుడ్ మార్నింగ్ మణికొండ’ (Good Morning Manikonda)పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి ఇంటికి ప్రతి రోజు ఒక చోట తిరుగడంలో భాగంగా పుప్పాలగూడ – నార్సింగి రోడ్డులోని స్కైలా అపార్ట్మెంట్ పక్కనున్న కులీ కుతుబ్ షాహీ నగర్ కాలనీలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. మంచి నీటి సరఫరా రెండు రోజులకు ఒకసారి కేవలం అరగంట మాత్రమే రావడం వలన, పూర్తిగా నీటి టంకర్లపై ఆధారపడ వలసి వస్తుందని వాపోయారు.
దీంతో ట్యాంకర్ల రేటు పెంచి ఎక్కువ డబ్బులు కట్టి నీరు కొనాల్సి వస్తుందని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ముష్కం చెరువు మొత్తంగా చెత్తా చెదారం వేయడం ద్వారా దుర్గంధంతో కూడిన దోమల బెడద తీవ్రంగా ఎదుర్కుంటున్నామని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని పర్యాయాలు తెలిపినా పట్టిం చుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు చెరువు కూడా పూర్తిగా అన్యక్రాం తమవుతుందని దక్షిణ రవీంద్ర సిబ్బంది సైతం స్పందించిపాలని ప్రజలు కోరినట్లు నాయకులు వెల్లడించారు.
రాత్రి కాగానే వీధి దీపాలు పనిచేయడం లేదని, దీంతో దోమల వ్యాప్తి తీవ్రంగా చెంది అనారోగ్యాలు పాలవుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ్ల, నాయకులు గుట్టమీద నరేందర్, ఏర్పుల శ్రీకాంత్, గోరుకంటి విఠల్, మాల్యాద్రి నాయుడు, ఉపేందర్నాధ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, షేక్ ఆరిఫ్, కందాట ప్రవీణ్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, రమణ మూర్తి, భాస్కర్ గౌడ్, రేఖ, రామాంజనేయులు, పవన్ తదితరులు పాల్గొన్నారు.