చేవెళ్లటౌన్, జూలై 11 : షాబాద్‌లో జరిగిన ఆరు హత్యలకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇం ద్రారెడ్డి డిమాండ్ చేశారు. షాబాద్‌లో జరిగిన విషాద ఘటనలో బాధిత కుటుంబాన్ని పరా మర్శించేందుకు బయలుదేరిన మాజీ మం త్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద ర్రెడ్డిలను పోలీసులు చేవెళ్ల మండంలోని మల్కాపూర్ గేట్ వద్ద అరెస్టు చేసి చేవెళ్ల ఠాణాకు.. అలాగే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలను చేవెళ్లలో అరెస్టు చేసి శంకర్పల్లి ఠాణాకు తరలించారు.
ఈ సందర్భం గా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సబితారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు మెతు కు ఆనంద్, మహేశ్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి సందర్శించారు. అనంతరం చేవెళ్ల ఠాణాలో సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రెండు కుటుంబాలకు చెం దిన ఆరుగురు హత్యకు గురి కావడం అత్యం త బాధాకరమన్నారు. బాధిత బంధువు లను పరామర్శిచేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం అత్యంత బాధాకరమని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పాలనను గాలికి వదిలేసి, ప్రజల ప్రాణా లతో చెలగాటమడుతున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ రోజురోజుకూ పెరుగుతున్నదని.. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని కనీసం రివ్యూ కూడా చేయలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపై పెట్టిన దృ ష్టి పాలనపై పెడితే బాగుటుందని హితవు పలికారు. బాధిత కుటుం బం ఫిర్యాదు చేసినప్పుడే.. రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే.. ఆరుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కాదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మాజీ ఎంపీపీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్ మల్లేశ్ ,శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ సర్పంచ్ శివారెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, కృష్ణా, యాదగిరి, రాంప్రసాద్, సత్యం తదితరులు పాల్గొన్నారు.