చెన్నూర్ టౌన్, ఆగస్టు 2 : తెలంగాణ విద్వత్సభ, దశాబ్ది మహోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణానికి చెందిన గట్టు నరహరి శర్మ అవధానిని జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఈ కా ర్యక్రమాన్ని నిర్వహించారు. వేద విద్యలో విశేష ప్రతిభకుగాను గట్టు నరహరి శర్మ అవధానిని జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో పాటు పలువురి చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. వేదకేసరి, వేదరత్న, వేదఛూడామణి, వేదశాస్త్ర జ్యోతిషాగమ విధ్వన్వరేణ్యవంటి బిరుదులు పొందారు.
రవీంద్రభారతిలో ప్రతిభా పురస్కారాలు
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఆగస్టు 1, 2 తేదీల్లో తెలంగా ణ విద్వత్సభ దశాబ్ది ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, జూ పల్లి కృష్ణారావు, కొండా సురేఖతో పాటు ధార్మి, ఆధ్యాత్మికవేత్తలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ మహాసభలను పుష్పగిరి జగద్గురు మహాసంస్థానం పీఠాధీశ్వరులు, అభినవోద్దండ విద్యాశంకరభారతి స్వామి ఆరంభించారు. మొదటి రోజు జ్యోతిష్య సదస్సు, మధ్యా హ్నం ఆగమ సదస్సు, సాయంత్రం విద్వత్సమ్మేళనం, జ్యోతిరాదిత్యం రూపకం ప్రదర్శన ఏర్పాటు చేశారు. రెండో రోజు ఆదివారం సిద్ధాంత సదస్సు, మధ్యాహ్నం ధర్మశాస్త్ర సదస్సు, సాయంత్రం విద్వత్సమ్మేళనం, సమాపనోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల వరిష్ట విద్వన్మూర్తులకు జీవనసాఫల్య పురస్కారంతో పాటు విశిష్ట ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. ఇందులో భా గంగా చెన్నూర్‌కు చెందిన విఖ్యాత వేదపండితులు బ్ర హ్మశ్రీ గట్టు నరహరిశర్మ అవధాని విశిష్ట ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.