వెల్దండ, ఆగస్టు 2 : బీటీ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం వేసి ఏడాది గడుస్తున్నా ఎందుకు పూర్తికాలేదని కంటోన్‌పల్లి గ్రామస్తులు ప్రశ్నించారు. వెల్దండ మండలం కంటోన్‌పల్లి గ్రామం నుంచి వెల్దండ వెళ్లే రహదారిపై ఆదివారం గ్రామ యువకులు వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రహదారి గుండా వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏళ్లు గడుస్తున్నా ఈ రహదారి రూపురేఖలు మారడం లేదన్నారు. గ్రామం నుంచి ప్రతిరోజూ కల్వకుర్తి, వెల్దండ, హైదరాబాద్ ప్రాంతాలకు ప్రజలు నిత్యం వెళ్తుంటారని, వానకాలంలో బైక్‌లపై వెళ్లే వారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సీతక్క వెల్దండ నుంచి కంటోన్‌పల్లి వరకు 3 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం వేశారని ఇప్పటివరకు రహదారి నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదని ఆరోపించారు. వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం ప్రా రం భించాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ శివప్రసా ద్ గ్రామ యువకులు తేజ, రాజు, ప్రవీణ్, రా ము, శివ, వెంకటేశ్‌తోపాటు గ్రామస్తులు పాల్గొ న్నారు.