ఆదిబట్ల, మే 30: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పల్లి (Mangalpally) గ్రామ మాజీ సర్పంచ్ నారని శంకరయ్య గౌడ్ (80) శుక్రవారం ఉదయం తెల్లవారు జామున మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ హయాంలో సర్పంచ్‌గా పనిచేసిన శంకరయ్య గౌడ్, మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరుడిగా పనిచేసి ఆయన వెంటే బీఆర్ఎస్లో చేరారు. శంకరయ్య గౌడ్ మృతి పట్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నిజాయితీగా పనిచేసే మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ , మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య , సీనియర్ నాయకులు పల్లె గోపాల్ గౌడ్, కోరె జంగయ్య, కల్వకోల్ రవీందర్ రెడ్డి, గోపగల్ల బాబులు, శ్రీనివాస్ గౌడ్, కాకి రవీందర్, నారాయణ, గజ్జెల ఎల్లారెడ్డి, గుండ్ల నర్సింహ, పాశం రవీందర్ గౌడ్, పాతూరి రవిగౌడ్, పొట్టి శ్రీకాంత్, పయిల్ల కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, వీరారెడ్డి, శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు నారని మౌనిక సుధాకర్ గౌడ్, కొప్పు కృష్ణరాజు, వనం శ్రీనివాస్, కంతి సంధ్య దయాకర్ తదితరులు సంతాపం తెలిపారు.