కడ్తాల్, మార్చి 4 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ కలిశారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మండల కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం వెళ్లిన ఆయన.. కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన వారిలో హరీశ్ అన్న యువసైన్యం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ తదితరులు ఉన్నారు.