వికారాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం బయటపడింది. రైతు వ్యతిరేకి అన్న నిజం తేటతెల్లమైంది. ఎవుసానికి ఉచిత కరెంట్ ఎందుకన్న ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వికారాబాద్ జిల్లా రైతాంగం భగ్గుమన్నది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతమని, ఎప్పుడొస్తదో తెల్వక బోరుబావుల వద్ద పడిగాపులు కాసే వాళ్లమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నది తెలంగాణ సర్కార్ ఉద్దేశం. సీఎం కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు తొలిగాయి. విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. నాడు కరెంట్ వస్తే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అన్నట్లుగా పరిస్థితి మారింది. 2017 జనవరి 1 నుంచి రాష్ట్ర సర్కార్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది. దేశంలోనే నిరంతర ఉచిత విద్యుత్తు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకూ నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. నిరంతర విద్యుత్తు సరఫరాతో వికారాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 3.30 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం… ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగింది. విద్యుదాఘాతంతో రైతుల మరణాలు ఒక్కటి కూడా నమోదుకాకపోవడం గమనార్హం. వికారాబాద్ జిల్లాలో 33కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యంగల విద్యుత్తు లైన్లు వేయడంతోపాటు 13,145 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితర పనులకుగాను రూ.303 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నిరంతర విద్యుత్ సరఫరాతో జిల్లాలో రోజుకు ప్రస్తుతం 4-5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుండగా, 75 వేలు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బుధవారం కూడా విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు రైతులు, పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైంది. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో నిరూపితమైంది. రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై జిల్లాలోని రైతులు భగ్గుమ న్నారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు మిగతా నియోజకవర్గాల్లోనూ ఆయన దిష్టిబొమ్మలను దహ నం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంట్ కష్టాలు, విద్యుదాఘాతంతో మరణాలు తప్ప జరిగిందేమీ లేదని..విద్యుత్తు కష్టాలతో బోర్లు, బావుల్లో నీరున్న సాగు చేసుకోలేని దుస్థితి ఉండేది. కాంగ్రెస్ హయాంలో విద్యుత్తు ఎప్పుడొస్తదా అని రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. మళ్లీ కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్ కష్టాలు తప్పవని అన్నదాతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మాకు మంచి రోజులొచ్చాయని.. నాడు కరెంట్ వస్తే వార్త..నేడు కరెం ట్ పోతే వార్తల కనీవినీ ఎరుగని మార్పును సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని కొనియాడుతున్నారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ వ్యవసాయానికి పగలు 6 గం టలు, రాత్రి సమయంలో 3 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేశారు. తదనంతరం రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు లు విద్యుదాఘాతానికి గురై మరణించడం తదితర ఇబ్బందికర ఘటనలతో రైతులకు ఇబ్బంది కలుగకుండా పగటిపూట నే 9గంటలపాటు విద్యుత్తును సరఫ రా చేశారు. 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయాని కి 9 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేసిన ప్ర భుత్వం…2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నది. 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటిగా నిలిచింది.
రూ.303 కోట్లతో..
జిల్లాలో 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా కోసం ప్రభుత్వం రూ.303 కోట్లు ఖర్చు చేస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 24 గంటలపా టు సరఫరా చేసేందుకు 11,617 కిలోమీటర్ల మేర 33కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యంగల విద్యుత్తు లైన్లు వేయడంతోపాటు 13,145 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తు న్న ప్రాధాన్యతతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 3.30 లక్షల ఎకరాల్లో ఆయాపంటలు సాగు కాగా.. ప్రస్తుతం 6 లక్ష ల ఎకరాలకు పెరిగింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కులకచర్ల, దోమ, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, యాలాల, బషీరాబాద్, పూడూరు మండలా ల్లో ఆయా పంటల సాగు గణనీయంగా పెరిగింది. నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో విద్యుదాఘాతంతో రైతుల మరణాలు ఒక్కటి కూడా నమోదుకాకపోవడం గమనార్హం. అదేవిధంగా రోజుకు ప్ర స్తుతం 4-5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, జిల్లాలో 75 వేలు వ్యవసాయ కనెక్షన్లున్నాయి.
అనుచిత వ్యాఖ్యలు తగవు ; రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్ : ఉచిత విద్యుత్తు సరఫరాపై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి మండిపడ్డా రు. సీఎం కేసీఆర్ ఓవైపు అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తూ.. 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుం టే..వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు అవసరం లేదు.. 3 గంటల విద్యుత్తు సరిపోతుందని మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీడ పురుగులాంటి వాడు ;రంగారెడ్డి జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి
ఇబ్రహీంపట్నం, జూలై 11 : రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి పట్టిన చీడ పురుగులాంటి వాడు. 24 గంటల విద్యుత్తు సరఫరాతో ప్రజలు సంతోషంగా వ్యవసాయం చేసుకుం టూ జీవిస్తున్నారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ నేడు రైతులకు ఉచిత కరెంటు దండగా అంటున్న రేవంత్‌రెడ్డి.. రేపు రైతుబంధు, రైతుబీమాతోపాటు ఇతర సంక్షేమ పథకాలూ వద్దని పేర్కొన్న ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు.
24 గంటల విద్యుత్తుతో సాగు విస్తీర్ణం పెరిగింది
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నది. దీంతో అప్పటి నుంచి సాగు విస్తీర్ణం పెరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుం దో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటాం.
–మన్నే రమేశ్ రైతు, పంచలింగాల్ మర్పల్లి మండలం
రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతాం..
ఉచిత విద్యుత్తు సరఫరాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెబుతాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సక్ర మంగా ఉండక చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు మంచి రోజులొ చ్చాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
యువ రైతు మల్లేశ్, మోత్కూర్ గ్రామం, దోమ మండలం
24 గంటలు కరెంటు ఉండాల్సిందే
రైతులకు 24 గంటలపాటు ఉచిత కరెంటు అవసరం లేదని రేవంత్‌రెడ్డి అనడం సమంజసం కాదు. నిరంతర సరఫరా ఉంటే రైతులు పగటి పూటనే పొలానికి నీరును పారించుకుంటారు. 8 గంటలు కరెంటు ఉం టే మళ్లీ రైతులకు పాత రోజులొస్తాయి. సీఎం కేసీఆర్ కృషితో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ రద్దు చేయాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
–మాసుల లక్ష్మయ్య, రైతు, దుద్యాల
కరెంటు బాధలు తప్పాయి..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కరెంటు కష్టాలు తీరాయి. రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు.. పొలం నుంచి ఇంటికొస్తే కరెంటు వస్తదేమోనన్న ఆందోళన ఉంటుండే. రాత్రులు పోదామంటే పురుగులు, పాము లు ఉంటాయని భయం ఉండేది.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ కష్టాలన్నీ తప్పాయి.
–పి.మల్లేశం రైతు, బూచన్‌పల్లి, మర్పల్లి మండలం