ఇబ్రహీంపట్నం, జూలై 12 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిర్వహించారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రేవంత్‌రెడ్డి డౌన్..డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ విజయవాడ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నర్విహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కార్యక్రమంలో ఎఫ్ఎస్సీ చైర్మన్ విట్టల్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోట వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కోట లక్ష్మారెడ్డి, రాజారాంచారి, పార్టీ మండల అధ్యక్షుడు దనుంజయ్యగౌడ్, సర్పంచ్‌లు కిరణ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. మంచాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. యాచారం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సాగర్హ్రదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఓవైపు బీజేపీ వ్యవసాయానికి మీటర్లు పెట్టాలంటూ.. మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి విద్యుత్ ఇంత అవసరం లేదని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగ మ్మ, బీఆర్ఎస్ నాయకులు పాశ్చ బాషా, మల్లేశ్, స్వరూప, కృష్ణ, యాదయ్య, మహ్మద్ కాజు, యాదయ్య శివసాయి తదితరులున్నారు.
రైతులపై కాంగ్రెస్ విషం కక్కుతుంది
తలకొండపల్లి : సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో అర్థం కాని పరిస్థితి అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్‌లు చంద్రయ్య, రమేశ్, మాజీ సర్పంచ్ శంకర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి, సీనియర్ నాయకులు దశరథనాయక్ పాల్గొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో..
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో కరెంట్ కష్టాలతో రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, రైతుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత కరెంట్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు గునుగుర్తి నక్షత్రం, బీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, సుధాకర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శ్రీహరియాదవ్, ఏఎంంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూఫ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్‌గౌడ్, రాజూనాయక్, బీఆర్ఎస్ నాయకులు ఆండ్రూ, బిక్షపతిగౌడ్, మాణిక్‌రెడ్డి, కుమ్మరి రాము పాల్గొన్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలో..
షాద్‌నగర్ : రేవంత్‌రెడ్డి ఖబడ్దార్.. తెలంగాణ రైతుల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నాయకులు, రైతులు హెచ్చరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. షాద్‌నగర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, నందిగామ మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్, కొందుర్గు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కొత్తూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణ, చౌదరిగూడ మండల కేంద్రంలో సర్పంచ్ బాబురావుల ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేశంపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, కొత్తపేట పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, వైస్‌చైర్మన్ అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, మండల కోప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, నాయకులు యాదగిరిరావు, నవీన్‌కుమార్, శేఖర్, వేణుగోపాలాచారి, మల్లేశ్‌యాదవ్, తిరుమలరెడ్డి శ్రీనివాస్, పర్వత్‌రెడ్డి, యాదగిరి, వెంకటేశ్, మురళీమోహన్, దేవేందర్‌యాదవ్, డోలీ రవీందర్, యాదగిరి, యాదయ్య, రమేశ్, మధుసూదన్‌రావు, తుప్పుడు కృష్ణ, నవీన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీశైలం, అర్జున్, దర్గా రాంచంద్రయ్య, జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, లక్ష్మీనర్సింహారెడ్డి, సుధాకర్, వీరేశం, రాఘవేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వచ్చాకే కరెంట్ కష్టాలు తీరాయి
ఆమనగల్లు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో కరెంట్ కష్టాలు తీరాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక రైతులు బావుల వద్ద పడిగాపులు కాశారని, ఆ విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కొంత మంది రైతులు విద్యాదాఘాతంతో కూడా మృతి చెందారన్నారు. రైతులు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్, మండల అధ్యక్షులు నేనావత్ పత్యానాయక్, అర్జున్‌రావు, జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీ దోనాదుల కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు సుభాశ్, రమేశ్, సీనియర్ నాయకులు రామకృష్ణ, సయ్యద్ ఖలీల్, గుత్తి బాలస్వామి, జంతుక అల్లాజీ, రూపం వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.