న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. పలు పల్లెలు, పట్టణాల్లో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవార్ల ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అందర్ని చల్లంగ చూడాలని, ఈ ఏడాది పంటలు అధికంగా పండాలని వేడుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను అలరించాయి. ఈ బోనాల ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఊరువాడా.. పల్లె, పట్టణం.. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.