సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.
శుక్రవారం ఉదయం 9:56 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, ఎయిర్పోర్టు అధికారులు.. తనిఖీలు చేపట్టి ఎలాంటి బాంబు లేదని తేల్చారు.