తాండూరు, ఏప్రిల్ 17 : తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను వెంటనే పార్లమెం ట్ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డిమాం డ్ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై యువ నాయకులు పార్లమెంట్లో తేజస్వీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ.. ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారతదేశం-పాకిస్తాన్ విభజనతో పో ల్చడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు.
గతంలో ప్రధాని మోదీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ ప్రజలను అవమానించారని, తాజాగా బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నదన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉండి కూడా తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన ఎంపీ తీరును ఖండించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ జాతిపిత , ఉద్యమ సారథి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధిస్తే.. బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తగదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వై యువనాయకులు షేక్ ఇబ్రహీం, వినోద్‌కుమార్, సోహెబ్ అడ్డు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.