మంచాల, జూలై 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చిత్తాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తనూ కంటికిరెప్పలా చూసుకోవడమే కాకుండా పార్టీలో వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో గండికోట రమేశ్, శ్రీను, పిట్టల మహేశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ పుల్లారెడ్డి, యాదయ్య, నాయకులు పల్లె జంగారెడ్డి, కందాల శ్రీశైలం, గొరెంకల శివ, రావుల కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
అబ్దుల్లాపూర్‌మెట్ : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పిగ్లీపూర్, జాఫర్‌గూడ గ్రామాల్లో నిర్మించిన నూతన పంచాయతీ భవనాలను ఎంపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, సర్పంచ్‌లు కోట రాధ, లావణ్యతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికి 18 నూతన గ్రామపంచాయతీ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. జాఫర్‌గూడలో మంచినీటి సమస్య ఉందని మహిళలు తెలుపడంతో ఎమ్మెల్యే స్పందించి అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి నిరం తరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్బర్అలీ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు పోచంపల్లి సుధాకర్‌రెడ్డి, చెరుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్‌పాషా, ఉసర్పంచ్లు బంగారి లక్ష్మమ్మ, డి శేఖర్, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.