Bhuvanagiri : రైతుల అభ్యున్నతే ధ్యేయం.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, వలిగొండ గ్రామాల్లో మండల రైతుబంధు సమితి కన్వీనర్ పనుమటి మమత నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనకు డప్పు చప్పుళ్లతో, బాణా సంచకాల్చుతూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు.
అనంతరం టేకులసోమారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించన అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి రైతుబంధు ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి టేకులసోమారం గ్రామం నుంచి వలిగొండ వరకు 20కిలో మీటర్లు స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఖాతాల్లో రూ. 50వేల కోట్లను జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

