Boat capsizes : తమిళనాడు (Tamil Nadu) లోని తూత్తుకూడి (Tutthukudi) తీరంలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి మత్స్యకారుల పడవ (Fishermen Boat) మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సుగిర్థన్ అనే వ్యక్తి మరో ఆరుగురితో రెండ్రోజుల క్రితం చేపల వేటకు వెళ్లారు. ఆదివారం బలమైన గాలులు వీయడంతో వారి పడవ మునిగిపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన మత్స్యకారులు సముద్రంలోకి దూకి సమీపంలోని ట్రావెలర్ పడవను గట్టిగా పట్టుకున్నారు. అదే సమయంలో చేపల వేటకు వచ్చిన మరో బోటు సిబ్బంది వారిని గమనించి తమ పడవలోకి ఎక్కించుకున్నారు. దాంతో మత్స్యకారులకు ప్రాణాపాయం తప్పింది.