ఫీజు బకాయిల కోసం నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
తాండూరు, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కొత్తగా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి పాత విధానం ప్రకారమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 2021 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం పేద విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు సయ్యద్ శుకూర్, జిల్లా నాయకుడు వెంకటేశ్, మహిళా ప్రతినిధులు అనిత, నర్సమ్మ, మంజుల, జగదీశ్వరి, వీరమణి, బస్వరాజ్, బీసీ సంఘం తాండూరు మండలాధ్యక్షులు నరేందర్, బసంత్, జోసఫ్, రాము ముదిరాజ్, నవీన్, మంతన్‌గౌడ్ అశోక్, టైలర్ రమేశ్, బీటీ . సురేశ్, పోచయ్య, తాండూరు నియోజకవర్గంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

