సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ అందరిబంధువయ్యారని భూగర్భగనులు, సమాచార శాఖల మంత్రి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం చేవెళ్లలో బీసీ, ఎంబీసీ కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ ప్రకాశ్, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బీసీబంధు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. అడగకముందే సబ్బండ వర్ణాలకు వరాలు అందిస్తున్నారన్నారు. మరోసారి గెలుపుతో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.
-షాబాద్, ఆగస్టు 25
షాబాద్, ఆగస్టు 25 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీసీ, ఎంబీసీ కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు అందించే బీసీబంధు కార్యక్రమాన్ని రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి వైస్ చైర్మన్ ప్రకాశ్, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బీసీబంధు లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు.
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ ప్రభు త్వ పథకాలు అందుతున్నాయని.. రైతును రాజుగా చేసేందు కు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దివ్యాంగులకు రూ.4016 పింఛన్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు తెలంగాణలో తప్ప మారే ఇతర రాష్ర్టాల్లో లేవన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెం దుతున్నదని.. ప్రపంచంలో పేరొందని పలు బహుళజాతి కంపెనీలతోపాటు దేశంలోని పలు సంస్థలు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేయడంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన మహేందర్‌రెడ్డిని రెండోసారి సీఎం కేసీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకోవడం సంతోషకరమన్నారు. చేవెళ్లలో కొందరు సభ పెడుతున్నారని, వారు ఏం మాట్లాడుతారో ప్రజలు గమనించాలని సూచించారు. కులాల ప్రజలను చిన్న చూపు చూసి మాట్లాడటం సరికాదని.. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్న నాయకుడు రేపు పొరపాటున అధికారంలోకి వస్తే ఇప్పుడు కొనసాగుతున్న పథకాలన్నింటిని రద్దు చేస్తారేమోనని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. కుల సంఘాల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. కొందరు నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టేందు కు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా చేవెళ్ల, శంషాబాద్‌కు నీటిని తీసుకొచ్చి గండిపేట, హిమయత్సాగర్ చెరువులను నింపుతామన్నారు. సీఎం కేసీఆర్ విధానం పది మందికి అన్నం పెట్టి, గౌరవించే విధానమని చెప్పారు. పవిత్రమైన ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేసేందుకు కొందరు నాయకులు సభల పేరిట ఇక్కడికి వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కర్ణాటకలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి చేయడం లేదని.. కరెంట్‌ను కూడా సక్రమంగా సరఫరా చేయడంలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ వందకుపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
సీఎం కాలె యాదయ్య అన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇంటింటికీ తాగునీరు, పంట రుణాల మాఫీ తదితర పథకాల అమలుతో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బీసీబంధు పథకం ఒక్క రోజుతో ముగిసిపోదని.. నిరంతరం కొనసాగుతుందన్నారు. అర్హులందరికీ ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, గోవర్ధ్దన్‌రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు మర్పల్లి మాలతి, పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, గోపాల్, వాసుదేవ్‌కన్నా, ఎంపీడీవోలు హిమబిందు, అనురాధ, వెంకయ్య, సంధ్యరాణి, వెంకటరంగారెడ్డి, ప్రశాంత్‌గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, రామేశ్వర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, జయవంత్, మల్లారెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, నరహరిరెడ్డి, జంగారెడ్డి, సత్యనారాయణచారి, నరేందర్‌చారి, శేఖర్, నర్సింహులు, నర్సింహారెడ్డి, రాజు, రాజుగౌడ్, భిక్షపతిగౌడ్, సుధాకర్‌యాదవ్, బాల్‌రాజ్, నర్సింహాగౌడ్, జనార్దన్‌రెడ్డి, గునుగుర్తి స్వరూప, ఎంపీటీసీ అర్జున్, వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు పరమేశ్, రాఘవేందర్‌యాదవ్, బిలాల్, రవీందర్, సురేందర్‌గౌడ్,యాదగిరిచారి, జైపాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ఈశ్వర్, రాజు, రాంచందర్, జైపారెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహాచారి, అరవింద్ పాల్గొన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి కొనియాడారు. బీసీలందరికీ బీసీబంధు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికీ 300 మందికి రూ.లక్ష చొప్పు న ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల ని యోజకవర్గంలో 300 మందికి రూ.3 కోట్లతో బీసీ బం ధు చెక్కులను అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతు న్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానన్నారు. రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చేవెళ్లలోని శ్రీవేంకటేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుఫూలే, చాకలి ఐల మ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, స్వర్గీయ ఇంద్రారెడ్డి, దివంగత రాజేందర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా మొయినాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీపీ గునుగుర్తి నక్ష త్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ , సర్పంచ్ల సంఘం మం డల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మంత్రి మహేందర్‌రెడ్డిని పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన దివంగత ఇంద్రారెడ్డి విగ్రహానికి.. అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.