ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు శుక్రవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ఒకరోజు ముందుగానే బతుకమ్మ వేడుకలు చేశారు.
విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీరొక్కపూలతో అందంగా బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలకు పూజలు చేసి వాటి చుట్టూ పాటలు పాడుతూ కోలాటం ఆడి సందడి చేశారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 12