యాచారం, డిసెంబర్12: బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పచ్చ బాషా అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మొరుగు శివలీల తరపున ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పూట్‌బాల్ గుర్తుకు ఓటేసి మొరుగు శివలీలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలో సర్పంచ్‌తో పాటుగా అత్యధికంగా వార్డు సభ్యులను గెలిపించుకొని ఉపసర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఫార్మారైతులు కాంగ్రెస్ పార్టీకి తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మొరుగు రమేష్, దోస మహేష్, అనిల్, సురేందర్‌రెడ్డి, సుధాకర్, శివకుమార్, మహేష్, దేవయ్య తదితరులున్నారు.