Ayushman Bharat | కొత్తూరు : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు ఎస్పల్లి సబ్సెంటర్లో బాగా నిర్వహిస్తున్నారని జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ కితాబునిచ్చింది. ఎస్బీపల్లి సబ్‌సెంటర్‌ను బుధవారం వర్చువల్‌గా జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ సమీక్షించింది. ఎస్బీపల్లిలో సబ్సెంటర్లో సోమవారం- యువ క్లీనిక్, మంగళవారం – ఏఎన్సీ క్లీనిక్, బుధవారం- పిల్లల టీకాలు, గురువారం వయోవృద్ధుల క్లీనిక్, శుక్రవారం- ప్రై డ్రై డే, శనివారం పిల్లల టీకాలు కార్యక్రమాలను సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఎంఎల్హెచ్బీ అధికారి రామ్‌నాయక్, ఏఎన్ఎం దుర్గా, సుజాత, ఆశలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి ఎన్‌క్వాస్ (ఎన్‌క్యూఏఎస్) టీ, జిల్లా ఎన్‌క్వాస్ టీంలు పరిశీలించాయి. కార్యక్రమాలను జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ వర్చువల్‌గా పరిశీలిస్తున్న సమయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు అకస్మాతుగా సందర్శించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్రావు జాతీయ ప్రమాణాల సంస్థ డాక్టర్ షకీలాలో ఎస్బీపల్లి సబ్సెంటర్లో జరుతున్న సేవల గురించి వివరించారు. ఇక్కడ సిబ్బంది పనితీరు బాగుందన్నారు. అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం జాతీయ ప్రమాణాల సంస్థ సర్టిఫికెట్ పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ షకీలా మాట్లాడుతూ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నాణ్యతా ప్రమాణాల సంస్థ నుంచి వచ్చే సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ హరికిషన్, ఎంఎల్‌హెచ్‌పీ అధికారులు రామునాయక్, సరిత, రాష్ట్రస్థాయి ఎన్‌క్వాస్ టీం కన్సల్టెంట్ వినయ్, జిల్లా ఎంక్వస్ టీం కన్సల్టెంట్ రాము, డీపీఎంవో అక్రమ్, హెల్త్ ఎడ్యూకేటర్ శ్రీనివాసులు, సీఎహ్వో నగేవ్, హెల్త్ సూపర్వైజర్ అనసూయ, ఫార్మాసిస్ట్ శ్రీనివాస్‌రెడ్డి, ల్యాబ్ టెక్సీషియన్ శివకుమార్, డీఈవో నీరజ, ఏఎన్ఎంలు దుర్గ, సుజాత పాల్గొన్నారు.