అవే కష్టాలు
ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవారం దర్శనమిచ్చాయి. పట్టణంలోని పరిగి రోడ్డులోని ఓ పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఉదయం నుంచే బారులు తీరారు.
- రోజులు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తీరని గ్యాస్, పెట్రోల్ అవస్థలు
- పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డుల దర్శనం
- ఇబ్బందుల్లో ప్రజలు, వాహనచోదకులు
షాద్‌నగర్‌టౌన్/కులకచర్ల, మార్చి 23 : ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవారం దర్శనమిచ్చాయి. పట్టణంలోని పరిగి రోడ్డులోని ఓ పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఉదయం నుంచే బారులు తీరారు. పెట్రోల్ దొరుకుతుందో..లేదోనని కొంత మంది వాహనాల్లో పెట్రోల్ పోయించుకుంటే మరికొందరు బాటిళ్లలో తీసుకెళ్లారు. పెట్రోల్ లేకపోతే పనుల నిమిత్తం బయటికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని, పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్యాస్ కోసం భారీ క్యూ..
కులకచర్ల : గ్యాస్ సిలిండర్ కష్టాలు రోజులు గడుస్తున్నా తీరడం లేదు. బుక్ చేసినా సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. భారత్ గ్యాస్‌ను నేరుగా గోదాము నుంచే వినియోగదారులకు పంపిణీ చేస్తుండడంతో ఉదయం నుంచే అక్కడికి భారీగా చేరుకుని నిరీక్షించారు. గ్యాస్ కొరత లేదని కేంద్రం ప్రకటిస్తున్నా గ్యాస్ నిర్వాహకులు మాత్రం గ్రామాల్లోకి సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్దకెళ్లి గంటల తరబడి క్యూలో నిరీక్షించి తెచ్చుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

