రంగులు వేసి మభ్యపెడుతున్నారు!
సీఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్స్కూల్కు రంగులు వేసి కొత్తగా నిర్మించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన భవనాలకు, షెడ్లకు కొత్తగా రంగులువేసి తామేదో సాధించామని కాంగ్రెస్ నేతలు జబ్బలు దర్సుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆరుట్ల పబ్లిక్ స్కూల్లో నిర్మించిన భవనాలు
- రూ.23లక్షల నిధుల దుర్వినియోగం
- దీనిపై వెంటనే విచారణ జరిపించాలి
- బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి
రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : సీఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్స్కూల్కు రంగులు వేసి కొత్తగా నిర్మించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన భవనాలకు, షెడ్లకు కొత్తగా రంగులువేసి తామేదో సాధించామని కాంగ్రెస్ నేతలు జబ్బలు దర్సుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆరుట్ల గ్రామంలో ఎప్పటినుంచో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా…దానిని తెలంగాణ మోడల్స్కూల్ అని తెలంగాణ ప్రభుత్వం మార్చిందన్నారు. విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి విద్యావ్యవస్థను మారుస్తానని తెలంగాణ మోడల్స్కూల్ను తెలంగాణ పబ్లిక్స్కూల్ను నామకరణం చేశారని ఆయన అన్నారు. ఈ స్కూల్ ఆధునీకరణ కోసం సోషల్ డెమోక్రెటిక్ ఫోరం సీఎస్ఆర్ నిధుల కింద రూ.23లక్షలను నిధులు జమ చేసిందని అన్నారు. ఈ నిధులతో స్కూల్ బయట గోడలకు పెయింటింగ్, ప్రహారీగోడ, భూగర్భఢ్రైనేజీ, ఆటవస్తువులు, ఫర్నిచర్, ఫుట్బాల్, క్రికెట ఆడుకునేందుకు వీలుగా నెట్బాక్సులు నిర్మించారని అన్నారు.
పైన పటారం…లోన లొటారం అన్నట్లు కేవలం ముందువైపు రంగులువేసి వెనుక గోడలను కూడా వదిలేశారని, టాయిలెట్లను కూడా మార్చలేదని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు కొత్తగా భవనాల నిర్మాణం చేసిందేమీ లేకపోగా…పాత భవనాలకు కేవలం బయటే రంగులు వేశారని అన్నారు. ఇది రేవంత్ మార్కు అభివృద్ధి అయి ఆయన ఎద్దేవా చేశారు. కేవలం రంగులు మార్చటకోసం రూ.23లక్షల నిధులను ఖర్చుచేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

