వికారాబాద్, మే 11 : లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వికారా బాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవ ర్గాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, పోలీస్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు 24/7 అప్రమత్తంగా ఉంటారన్నారు. జిల్లాలో మొత్తం 9,84,0 68 మంది ఓటర్లుండగా.. 113 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నిఘా నీడలో పోలిం గ్ జరుగనున్నదన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడితే సీ-విజిల్ యాప్‌లో గానీ, 1950 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ఓటరు స్లిప్పులను బీఎల్వోల నేతృత్వంలో సిబ్బంది అందిస్తు న్నారని.. ఇప్పటివరకు 99% వరకు పూర్తైందన్నారు. స్లిప్పుల రాని వారు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బీఎల్వోల నుంచి తీసుకోవాలన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో వెళ్తారని.. పోలింగ్ సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు పోలీస్ భద్రత మధ్య చేరుకుంటాయని.. వికారాబాద్, తాండూరు, పరిగి సెగ్మెంట్ల ఎన్నికల బాక్సులు చేవెళ్లకు.. కొడంగల్ నియోజకవర్గానికి చెందినవి మహబూబ్‌నగర్‌కు వెళ్తాయని వివరించారు. ఈవీఎంలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అదనంగా యంత్రాలను అందుబాటులో ఉంచామని.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పెంచామ న్నారు. ఇప్పటివరకు సీ- విజిల్ యాప్ ద్వారా 68 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ నారాయరెడ్డి తెలిపారు.