Guest Faculty | పరిగి, జూలై 19 : పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు. అభ్యర్థులు పీజీలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగియుండాలని, ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు పీజీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. పీహెచ్డీ, నెట్, స్లెట్, సెట్‌తో పాటు బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఇంగ్లీష్, తెలుగు, హిస్టరీ, గణితం, పొలిటికల్ సైన్స్, జువాలజీ సబ్జెక్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. దరఖాస్తులను కళాశాలలో ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని, వివరాలకు ఫోన్ నెంబర్ 9701774143లో సంప్రదించాల్సిందిగా ఆమె సూచించారు. ఇంటర్వ్యూల తేదీని ఫోన్ ద్వారా అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.