రంగారెడ్డి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరువు నేపథ్యం లో ఉపాధి హామీ పనులు కల్పించాలని నిరుపేద లు కోరుతున్నారు. అందుకోసం జాబ్‌కార్డుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 63,318 మంది తమకూ కార్డులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న ట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పట్టణీకరణతో గ్రామాలు మున్సిపాలిటీలుగా మారడం.. నీరు లేక పంటలు పండని పరిస్థితి నెలకొన్నడం.. పనులు చేసుకుందామంటే ప్రభుత్వం కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావాలంటే ఉపాధిహామీలో జాబ్ కార్డు కలిగి ఉండి కనీసం 20 రోజు లు పనిచేసిన వారికి మా త్రమే ఇస్తామని మెలిక పెట్టడంతో ఈ పథకంలో చేరేందుకు ప్రజలు, కూలీలు, నిరుపేదలు ఎక్కువగా ముందుకొస్తుండడంతో అధికారులు జాబ్‌కార్డుల జారీని నిలిపేశారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపేయగా.. 21 గ్రా మీణ మండలాల్లో మాత్రం యథావిధిగా కొనసాగుతున్నది. ప్రస్తుత పరిస్థితిలో భూమి లేని పేదలకు సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి హామీ పథకమే దిక్కైంది.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 1,60,000 మందికి అధికారులు జాబ్‌కార్డులు అందించారు. ఈ కార్డులు పొందిన కుటుంబాల్లోని సుమారు 2,61,000 మంది ప్ర స్తుతం పనిచేస్తున్నారు. ఈ పథకం కింద జనవరి నుంచి జూన్ నెల వరకు కూలీలకు పనులు కల్పించాల్సి ఉంటుంది. కాగా, జాబ్‌కార్డులు లేనివారు 63,318 మంది తమకూ కార్డులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల 1800 మందికి మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన వారు తమకెప్పుడు ఇస్తారని అధికారులను అడుగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించా రు. కాగా, పవర్లోకి వచ్చిన తర్వాత రేవం త్ సర్కార్ ఉపాధి హామీ జాబ్‌కార్డులు కలిగి ఉండి కనీసం 20 రోజులు పనిచేసిన వారే ఈ పథకానికి అర్హులని లింకుపెట్టింది. దీం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకునే నిరుపేదలు జాబ్‌కార్డులు తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుండడంతో అధికారులు వాటి జారీని నిలిపేశారు.
జిల్లాలో కరువు నేపథ్యంలో గ్రా మీణ ప్రాంతాల కూలీలకు పను లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో అర్హులైన వా రందరినీ చేర్చుకుని పనులు కల్పించాలి. అలాగే, దరఖాస్తు లు చేసుకున్న వారికి జాబ్‌కార్డులు ఇవ్వాలి.
జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు పని దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఉపాధి హామీ కింద గ్రామీణ కూలీలకు పనిని కల్పించాలి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ జాబ్‌కార్డులు ఇవ్వాలి.